ETV Bharat / state

'ప్రకాశి'స్తున్న అద్భుత చిత్రాలు - images

కాగితం పైనే కాదు..కాటన్ బట్టపైనా అద్భుత చిత్రాలు గీయగలడు ప్రకాశ్. సాధనతో అలవోకగా అందమైన బొమ్మలు గీస్తూ బహుమతులు గెలుచుకుంటున్నాడీ ఉరవకొండ అబ్బాయి.

'ప్రకాశి'స్తున్న అద్భుత చిత్రాలు
author img

By

Published : Aug 8, 2019, 2:39 PM IST

ఆ అబ్బాయి చేతులు అద్భుతాన్ని చేస్తున్నాయి. కాగితంపైనే కాదు కాటన్ బట్టలపై కూడా అందమైన బొమ్మలను అవలీలగా గీసి అందరి చేతా ఔరా అనిపిస్తున్నాడు.
అనంతపురం జిల్లా ఉరవకొండ హమాలి కాలనీకి చెందిన సురేంద్ర ప్రకాశ్ కు చిన్ననాటి నుంచి బొమ్మలు గీయటమంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అనంతపురంలో బీటెక్ చేస్తున్నాడు. తల్లి సావిత్రమ్మ ఆర్టీసి డిపో వద్ద చిన్న హోటల్ నడుపుతూ కొడుకును చదివిస్తోంది. మక్కువతో సాధన చేసి దేవుళ్లు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఎన్నెన్నో రకాల బొమ్మలను అలవోకగా గీసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. మొదట చిన్న చిన్న చిత్రాలు గీసిన ప్రకాశ్​.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి పట్టు సాధించాడు. అద్భుత కళాకారుడిగా ఎదిగాడు. ఇప్పటివరకు వివిధ రకాల చిత్రాలను గీశాడు. వాటిలో దేవుళ్ళు, ప్రకృతి అందాలు, సైన్స్ సంబంధిత చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తుల చిత్రాన్ని కూడా గీయగల ప్రావీణ్యం సంపాదించాడు.
ఎంతటి చిత్రాన్ని అయినా ఎంతో అందంగా గీయడం సురేంద్ర ప్రత్యేకత. ఇంట్లో ఎక్కడ చూసినా అతను గీసిన బొమ్మలే. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచాడు. చదువులో ప్రతిభ చూపుతూనే చిత్రలేఖనంలోనూ సత్తా చాటుతున్నాడు. ఎన్నో పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వల్లే ఇది సాధ్యమయిందని అంటున్నాడు. ఉపాధ్యాయులు, దాతలు మరింత ప్రోత్సహిస్తే తన ఊరికి, జిల్లాకి మంచి పేరు తెస్తానంటున్నాడు సురేంద్ర ప్రకాశ్.

Intro:ap_rjy_36_08_varada_lanka_kotha_avb_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వరద ఉధృతికి కోతకు గురి అవుతున్న లంకభూములు

Conclusion:ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నందున 12లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి వదలటంతో గౌతమిగోదావరి పరివాహక లంక భూములు విపరీతంగా కోతకు గురిఅవుతున్నాయి. తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంకల్లో నిన్న సాయంత్రం నిటారుగాఉన్న కొబ్బరిచెట్లు తెల్లవారేసరికి గోదావరిలోకి ఒరిగిపోయి కనిపించేవి కొన్ని కనిపించకుండాపోయినవి మరిన్ని..దీంతోవాటినే జీవనాధారంగా చేసుకుని జీవించే వందలాది కుటుంబాలు ఆందోళనచెందుతున్నారు.తాతలకాలంలోని వందల ఎకరాలు ఉన్న లంకభూములు మనవళ్ళు కాలానికి వచ్చేసరికి సెంటుభూమి మిగలలేదని దిగులుచెందుతున్నారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇదగో అదిగో అంటూ కబుర్లుచెప్పుకుంటూ ఏటికేళ్ళు గడిపారు తప్ప కోతలను ఆపే పనులను చేపట్టలేకపోయారని భూయజమానులు ఆవేదనచెందుతున్నారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.