అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంరలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
కరోనా నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఓ చేత్తో పేదలకు డబ్బు ఇస్తూ.. మరో చేత్తో మద్యం పేరున దోపిడీ చేస్తుంటే ప్రభుత్వంలోని మహిళా నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లు, నిత్యావసరాల ధరలను తగ్గించాలన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: