Gadapa Gadapa Program in Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామంలో నిర్వహించిన 'గడప గడపకూ..'కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురైంది. కేవలం ఓట్ల కోసం మాత్రమే 'అమ్మా.. అయ్యా.. అంటూ వస్తారా.. సమస్యలు పట్టించుకోరా..' అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. ఆమె భర్త పింఛన్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవీ చదవండి :