అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మండలంలో వాగులు, వంకలు చెక్ డ్యామ్లు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు భారీగా వర్షం నీళ్లు చేరుతున్నాయి. వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పురపాలిక అధికారులు వెంటనే స్పందించి మోటార్ల సాహయంతో నీటిని బయటకు పంపుతున్నారు.
కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలో భారీ వర్షలకు పోలేపల్లి చెరువు రెండు చోట్ల తెగిపోగా నీరంతా వేదవతి హగరి నదిలో ప్రవహిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నీరు చెరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.