అనంతపురం జిల్లా ధర్మవరంలో అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలతో చేనేత కార్మికుడు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. రాజేంద్ర నగర్‌కు చెందిన కుల్లాయప్ప చేనేత అనుబంధ వృత్తి అయిన జాకార్డు అట్టలు కొట్టే పనిచేస్తూ జీవించేవాడు. అతను మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. పనిచేస్తున్న సమయంలో కాలికి గాయం అయ్యింది. దానికితోడు లక్షకు పైగా అప్పులు చేశాడు. వీటన్నింటితో మానసికంగా కుంగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..