కల్యాణదుర్గం అభివృద్ధి కి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా సహకరిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు. కల్యాణదుర్గం మున్సిపాలిటీ చివరి కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రస్తుత కౌన్సిలర్లు ,మున్సిపల్ ఛైర్మన్ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. భవిష్యత్తులోనూ తమ పార్టీ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీచదవండి