ETV Bharat / state

కొండలు..వాగులు..జల భాండాగారాలు!

ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టాలి.. పరిగెత్తే నీటికి అడ్డుకట్ట వేసి, ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేపట్టిన ‘జల సంరక్షణ’ ఉద్యమం ఫలితాలనిస్తోంది. దశాబ్ద కాలంగా నిర్మించిన వివిధ కట్టడాలు భూగర్భ జలాలను పెంపొందిస్తున్నాయి. సమగ్ర నీటి యాజమాన్య కార్యక్రమం (ఐడబ్ల్యూఎంపీ) కింద అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. కొండలు.. వాగులు.. వంకల్లో పరిగెత్తే నీటికి అడ్డుకట్ట వేసి నడిచేలా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెక్‌డ్యామ్‌లు, కుంటలు కళకళలాడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టం పెరుగుతోంది.

water resources in ananthapuram district
కొండలు..వాగులు..జల భాండాగారాలు!
author img

By

Published : Aug 15, 2020, 7:57 AM IST

ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టాలి.. పరిగెత్తే నీటికి అడ్డుకట్ట వేసి, ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేపట్టిన ‘జల సంరక్షణ’ ఉద్యమం ఫలితాలనిస్తోంది.

ఏడేళ్లు.. రూ.201 కోట్లు

వాటర్‌షెడ్ల కార్యక్రమాలకు అనంత జిల్లా పుట్టినిల్లు. ఇక్కడ పలు పేర్లతో అమలు చేస్తున్నారు. 2011-12లో 3వ బ్యాచ్‌, 2012-13లో 4వ బ్యాచ్‌ కార్యక్రమాలు చేపట్టారు. 3వ బ్యాచ్‌ గత నెల 20వ తేదీ, 4వ బ్యాచ్‌ గడువు ఈనెల ఆఖరుతో ముగియనుంది. ఈ రెండింటిలోనూ రూ.252.94 కోట్ల అంచనా వ్యయంతో పలు పనులు చేపట్టారు. ఏడేళ్ల కాలంలో రూ.201.4 కోట్లు వ్యయం చేశారు. నీటి సంరక్షణ, జీవనోపాధుల కల్పన, కుటీర పరిశ్రమల ఏర్పాటు, మొక్కలు పెంపకం వంటి వాటిని అమలు చేశారు.

జల సంరక్షణకు ప్రాధాన్యం

రెండు బ్యాచ్‌ల కింద జల సంరక్షణ కట్టడాలకు రూ.89 కోట్లు ఖర్చు పెట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి రూ..69 కోట్లతో 15,279 పనులు, 2019-20లో రూ.20 కోట్లతో 5,724 కట్టడాలు నిర్మించారు. కొండల్లో, వాగు, వంకలకు అడ్డంగా చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు నిర్మించారు. సేద్యపు కుంటలు, రాతి కట్టడాలు, చెక్‌వాల్స్‌, కొండల చుట్టూ కందకాలు తదితర పనులు చేపట్టారు. 3వ బ్యాచ్‌ కింద 29 ప్రాజెక్టుల పరిధిలో 126 సూక్ష్మ వాటర్‌షెడ్లను అమలు చేశారు. 504 గ్రామాల్లో 1.25 లక్షల ఎకరాల్లో భూఅభివృద్ధి చేపట్టారు. 4వ బ్యాచ్‌లో 16 ప్రాజెక్టుల్లో 65 వాటర్‌షెడ్ల కింద 260 గ్రామాల్లో 67 వేల ఎకరాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు.

భూగర్భ జలాలు పెరిగాయి

వాటర్‌షెడ్ల కార్యక్రమాల కింద నీటి సంరక్షణ పనులు అనేకం చేపట్టాం. తీవ్ర వర్షాభావంతో సాగుకే కాదు.. తాగునీటికి కూడా కష్టమే. ఇలాంటి క్లిష్ట తరుణంలో నీటి సంరక్షణ పనులు చేపట్టాం. భూమిలోకి ఇంకేలా చేస్తున్నాం. ఫలితంగా 30-40 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. 10 నుంచి 12 మీటర్లు చేరింది. కొన్నిచోట్ల రెండు మూడు పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి కట్టడంలోనూ జలాలు నిండుగా ఉన్నాయి. --- సుధాకర్‌రెడ్డి, అదనపు పీడీ, డ్వామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.