ETV Bharat / state

WATER: వారం రోజులుగా 1600 గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా - అనంతపురం జిల్లా న్యూస్ అప్​డేట్స్

అనంతపురం జిల్లాలో తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సమ్మె బాట పట్టడంతో 1600 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. 27 ఏళ్లుగా సత్యసాయి పథకం నిర్వహణ చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇటీవల కాంట్రాక్టు నుంచి తప్పుకోవటంతో కార్మికుల వేతన బకాయిల చెల్లింపుపై నీలినీడలు అలుముకున్నాయి. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులకూ 8 నెలల వేతనాలు ప్రభుత్వం బకాయి పడింది.

water problem
water problem
author img

By

Published : Jul 16, 2021, 12:16 PM IST

వారం రోజులుగా 1600 గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా

అనంతపురం జిల్లాలో సత్యసాయి, శ్రీరామరెడ్డి తాగునీటి పథకాల్లో పనిచేసే కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవటంతో వారంతా ఏడు రోజులుగా సమ్మెబాట పట్టారు. జలదీక్ష, భిక్షాటన నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అనంతపురం జిల్లాలోని 70 శాతం గ్రామాల్లోని 3 లక్షల మందికి వారం రోజులుగా తాగునీరు అందటం లేదు. సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇటీవలే నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలపై సందిగ్ధం నెలకొంది.

శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు కూడా ఏడు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. 480 మంది కార్మికులు 8 నెలల వేతనాల కోసం అధికారులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవటంతో సమ్మెబాట పట్టారు. దాంతో అనేక గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వారం రోజులుగా రక్షిత తాగునీరు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కారించాలని అధికారుల్ని కోరుతున్నారు.

కార్మికుల వేతన బకాయిల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా అధికారులు.. రెండు రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదీ చదవండి; WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.