ETV Bharat / state

'మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు' - gutti

అనంతపురం జిల్లా గుత్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ గ్రామానికి మద్యం దుకాణం మంజూరు చేసిందని...వెంటనే అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.

తమ ఊరిలో మద్యం దుకాణం రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన గ్రామస్తులు
author img

By

Published : Aug 29, 2019, 6:46 AM IST

తమ ఊరిలో మద్యం దుకాణం రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన గ్రామస్తులు

అనంతపురం జిల్లాలోని రాయలచెరువు గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్న మద్యం షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ... గుత్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ గ్రామానికి మద్యం దుకాణం మంజూరు చేసిందని, తమ తలరాతలు మార్చే అలాంటి దుకాణాలు వద్దని ధర్నా చేపట్టారు. తమ కాలనీ పరిసరాల్లో అనేకమంది పొట్ట కూటికోసం రోజువారి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్మును పోగుచేసుకుంటున్నారని... ఇలాంటి సమయంలో తమ కాలనీలో మద్యం దుకాణాలు తెరవడంవల్ల తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని...ఎక్సైజ్ అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... ఏపీలోనే తక్కువ

Intro:AP_cdp_48_28_pattanamlo_aranyam_pkg_Ap10043
k.veerachari, 9948047582
అందమైన అటవీ ప్రాంతాన్ని తలపించేలా కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూడండి లంకమల్ల సౌందర్యమో.. లేక శేషాచలం సొగసులో అయ్యుండొచ్చు అనిపిస్తోంది కదూ.. ఏపుగా పెరిగిన మహావృక్షాలు.. ఆకాశానికి గొడుగు పట్టినట్లుగా అక్కడంతా చల్లదనం ఉంటుంది. భూమిపై పైరు పెట్టినట్లు పచ్చదనం పరుచుకుంది. ఎటు చూసిన నిలువెత్తు వృక్షాలే. ఆ ప్రాంగణంలో అడుగు పెడితే వనదేవత ఒడిలో విశ్రాంతి తీసుకున్న భావన కలుగుతుంది. ఎంత ఎండ కాచిన ఇక్కడ మాత్రం చల్లగా ఉంటుంది. ఈ హరిత అందాలు ఏ అరణ్యప్రాంతంలోనివో కాదు కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనివి.
* సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవోలు నివసించడానికి నివాస భవనం, పరిపాలన, సభా భవనాలు ఉన్నాయి. సభల నిర్వహణకు వేదిక ఉంది. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య భవనాలు కూడా కనిపించవు. బయటి నుంచి చూస్తే అక్కడ కార్యాలయం ఉందన్న విషయం కూడా తెలియనంత దట్టంగా చెట్లు పెరిగాయి. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పచ్చదనం పరుచుకొని ఆవరణం ఆహ్లాదకరంగా మారింది. డివిజన్లోని 17 నుంచి వివిధ పనుల నిమిత్తం నిత్యం ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ చెట్ల కిందనే సేద తీరుతున్నారు.

Body:పట్టణంలో అరణ్యం.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ఆవరణం... కనువిందు చేసి పచ్చదనం సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రత్యేకం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.