విశిష్ట సంప్రదాయంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో.. ఓ 8 ఏళ్ల బాలికతో శ్రీవారి పరిణయం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుక జరిపారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. సంప్రదాయం ప్రకారం పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో కల్యాణాన్ని జరిపించారు.
పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి.. శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కడతారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో ఆమె తల్లి కట్టడంతో పెళ్లి తంతు ముగుస్తుంది. శ్రీవారితో పెళ్లైన బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏళ్లనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా ఎనిమిదేళ్ల బాలికతో శాస్త్రోకతంగా శ్రీవారి కల్యాణం జరిగింది.
ఇవీ చదవండి: