అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు పట్టణాల్లో కర్ఫ్యూను పక్కనపెట్టి.. వాహనదారులు, ఆటో వాలాలు యథావిధిగా రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇవాళ నుంచి కర్ఫ్యూ విధించింది. కానీ అక్కడ దుకాణాలు మూత పడినా.. వాహనదారులు సంచరిస్తూనే ఉన్నారు. కొవిద్ నిబంధనలు ఉల్లంఘించి గుత్తిలో మద్యం విక్రయిస్తున్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఎస్సై గోపాలుడు జరిమానాలు వేశారు.
ఇదీ చదవండి: 'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'
గుంతకల్లులోనూ కర్ఫ్యూ నిబంధనలు పాటించని ఓ హోటల్ యజమానికి అధికారులు రూ. 10 వేలు అపరాధరుసుము విధించారు. అత్యవసరమైతే మినహా ఇంటి నుంచి ప్రజలు ఎవరూ బయటికి రావద్దని టాస్క్ఫోర్స్ అధికారులు సూచించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు డీఎస్పీ షర్పుద్దీన్ జరిమానాలు వేశారు. ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
'వెంటిలేటర్లు లేక నలుగురు చనిపోయారు.. అధికారులూ పట్టించుకోండి'