ETV Bharat / state

'దిశ' ద్వారా ఒక్క కేసైనా పరిష్కరించినట్లు రుజువు చేస్తారా..అనిత సవాల్​

author img

By

Published : Dec 19, 2020, 7:48 PM IST

రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం ద్వారా ఒక్క కేసైనా పరిష్కరించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాని సవాల్ విసిరారు.

anitha on attacks on women
వంగలపూడి అనిత

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలులో లేదని విమర్శించారు. దిశ చట్టం ద్వారా ఒక్క కేసైనా పరిష్కరించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిత సవాల్​ విసిరారు.

పుట్టపర్తిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి అదేరోజు బెయిల్​ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మహిళలపై దాడులు జరిగినా స్పందించటం లేదని దుయ్యబట్టారు. మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగితే పులివెందుల నియోజకవర్గం నుంచి ఉద్యమాలు ప్రారంభిస్తామని అనిత అన్నారు.

ఇదీ చదవండి: సిబ్బంది నిర్వాకం..కూలి ఇంటికి రూ.1.49 లక్షల కరెంట్​ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.