up man died of current shock: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిడిగల్లు వద్ద కేబుల్ పనులు చేస్తున్న ఓ కార్మికుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాధా శ్యామ్.. ఏపీ ఫైబర్ పనులు చేసేందుకు నిచ్చెన ద్వారా స్తంభం పైకి ఎక్కాడు. అతని పక్కనే ఉన్న విద్యుత్ నియంత్రిక నుంచి విద్యుత్ ఘాతం సరఫరా కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌కు చెందిన రాధా శ్యాం.. ఉపాధి నిమిత్తం అనంతపురానికి వచ్చి.. కేబుల్ పనులు చేస్తున్నాడని తోటి కార్మికులు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: