ETV Bharat / state

పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాలో ఆటంకాలొద్దు: జేసీ - అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్

అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ హిందూపురంలో పర్యటించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాలో ఆటంకాలొద్దు : జేసీ

author img

By

Published : Oct 14, 2020, 8:49 PM IST

అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ హిందూపురం పట్టణంలో పర్యటించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సులభ్ కాంప్లెక్స్​ను తనిఖీ చేశారు.

అలా చేయాలని చెప్పాం: జేసీ

పట్టణంలోని పారిశుద్ధ్య పనులపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలను సూచించామని జేసీ నిశాంత్ తెలిపారు. పట్టణ వాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా పని చేయాలని కోరారు. నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ భవన సముదాయాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేసి వ్యాపారస్తులకు అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.