కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు వివిధ పనుల కోసం బయటకు వచ్చే వారు మాస్కులు తప్పనిసరిగా వాడాలంటూ అన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు ఆంక్షలు విధించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రేషన్, మార్కెట్, నిత్యావసరాల దుకాణాలకు వచ్చే వారు మాస్కులతో పాటు గొడుగు కూడా తప్పనిసరిగా ఉండాలంటూ పురపాలిక కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు అనుగుణంగానే తాడిపత్రి ప్రజలు గొడుగు తీసుకుని రేషన్ దుకాణానికి వచ్చారు. ఈ చర్యకు ఫలితంగా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడానికి వీలు అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: