అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బుధగవి గ్రామం వద్ద ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. వై. రాంపురం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, తిప్పయ్య.. తీవ్రంగా గాయపడ్డారు. వారు విడపనకల్ వెళ్లి తిరిగి సొంత గ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉండగా.. ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
ఇదీ చదవండి: