అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ యువకుడి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సాయి టవర్ రెస్టారెంట్లో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న మహేష్ ఈనెల 19న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు రెస్టారెంట్ యజమాని పద్మనాభం, మేనేజర్ శైలజ కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయి టవర్స్ వద్ద ఆందోళన చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రెస్టారెంట్ యజమాని, మేనేజర్ పద్మనాభం, శైలజలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా సాయి టవర్స్ రెసిడెన్షియల్ హోటల్లో మహేష్ చేసిన చిన్న తప్పుకు అతనిని మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండ...