అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఎల్బీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తున్న ప్రసాద్ అనే రైతు విద్యుత్ తీగలు తగిలి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వలీ.. రైతును కాపాడబోయి విద్యుదాఘాతానికి గురయ్యాడు.
వీరిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తీగలు నేలపై పడి... తమ వారు చనిపోయారంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: