ETV Bharat / state

లేని దారి కోసం అధికారుల ఒత్తిడి.. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం - latesdt land Anantapur district

Two farmers attempted suicide: తమ పొలం నుంచి ప్రభుత్వాధికారులు దారి వేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నాయకుల మాటలు విని అధికారులు ప్రయత్నించడమే కాకుండా.. తమపై దాడి చేశారని బాధిత రైతు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆత్మహత్యాయత్నం చేసిన రైతులు
farmers attempted suicide
author img

By

Published : Dec 1, 2022, 6:55 PM IST

Farmers attempted suicide due to land issue: అది వారి భూమి.. వైసీపీ నాయకులతో కలిసి అధికారులు వారి భూమిలో నుంచి దారి వేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ.. ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో పొలం దారి విషయంలో అధికారులు, రైతుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 623లో పొలాలకు దారి లేకపోయినప్పటికీ.. దారి వదలాలంటూ కొందరు ఆధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా ప్రదేశానికి వచ్చారు.

దారి చదును చేయడానికి వచ్చిన పోలీసు, రెవెన్యూ అధికారులు, వైసీపీ నాయకులు, జేసీబీని బాధిత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో.. అధికారులు, బాధిత రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాధిత రైతులు శ్యామలమ్మ, రామస్వామి ఘటనాస్థలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని పోలీసు వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ పొలంలో లేని దారిని సృష్టించడానికి.. వైసీపీ నాయకుల మాటలు విని అధికారులు ప్రయత్నించడమే కాకుండా తమపై దాడి చేశారని, బాధిత రైతు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసులు, రెవెన్యూ అధికారుల ఎదుటే పురుగుమందు తాగిన రైతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.