అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గాంధీనగర్‌లో విషాదం జరిగింది. మురుగు నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. పట్టణానికి చెందిన శ్రీనివాసులు, గంగాధర్‌లు అన్నదమ్ములు వారి కుమారులు కార్తీక్ చరణ్, నిఖిల్ పెన్నా నది వద్ద ఉన్న పార్కులో ఆడుకునేందుకు వెళ్లారు. పార్కు నుంచి నదిలోకి వెళ్తుండగా..కార్తీక్(9), నిఖిల్(6) ప్రమాదవశాత్తు మురుగు గుంతలో పడిపోయారు. గమనించిన స్థానికులు చరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారులు అప్పటికే మరణించారు.
విషయం తెలుసుకున్న తెదేపా నేత జేసీ అస్మిత్ రెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడిపత్రి పట్టణం నుంచి వచ్చే అంతర్గత మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పెన్నా నదిలోకి మురుగు నీరు వస్తోందని... ఇలా మురుగు నీరు పెన్నానదిలోకి మళ్లించకుండా ఉంటే తమ కుమారులు బతికేవారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
CM Letter To PM: 'ప్రైవేటు ఆస్పత్రులు వాడని కొవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం సేకరించాలి'