ETV Bharat / state

రహదారిపై ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు - మడకశిరలో ఎలుగుబంట్లు వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రెండు ఎలుగు బంట్లు హల్​చల్ చేశాయి. రహదారిపై తిష్ట వేసి.. వాహనదారులను భయపెట్టాయి.

bears
bears
author img

By

Published : Dec 30, 2020, 8:54 AM IST

రహదారిపై ఎలుగుబంట్లు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జనారణ్యంలో అడవి జంతువుల సంచారం పెరిగింది. మంగళవారం రాత్రి మడకశిర నుంచి వై.బి.హళ్లి గ్రామానికి వెళ్లే రహదారిపై ఎలుగుబంట్లు తిష్టవేసి ఉన్నాయి. అటుగా వెళ్తున్న బొలెరో వాహన చోదకుడు వాటిని చూసి అప్రమత్తమయ్యారు.

హారన్ మోగిస్తూ వాటిని అక్కడి నుంచి చెట్ల పొదల్లోకి వెళ్లేలా చేశారు. అనంతరం అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులను సైతం ఆయన అప్రమత్తం చేశారు. ఇటీవల ఆ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. 'గీత దాటితే' తప్పవు బేడీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.