Revanth reddy house arrest: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇవాళ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. ఆందోళన చేస్తామని టీపీసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. సర్పంచ్‌ల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. మరోవైపు కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్‌గౌడ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకని.. అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడంలో అర్థం లేదని హస్తం నేతలు విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అణిచివేస్తోందని ఆరోపించారు.
ఇవీ చదవండి :