చీరలోని గొప్పతనం తెలుసుకో... ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో... అన్నాడో సినీ కవి. చీరతో సంప్రదాయమే కాదు సాంకేతికతనూ పంచుకో అంటున్నారు ధర్మవరం త్రీడీ చీరల డిజైనర్లు. చీరంటే ఎప్పడూ..ఒకేలా తయారుచేయడం ఎందుకు అనుకున్నారేమో.... అన్నిట్లో ప్రత్యేకంగా ఉండేలా రూపుదిద్దాలనుకున్నారేమో.. ట్రెండ్‌కు తగ్గట్టుగా త్రీడీ చీరను తీసుకొచ్చేశారు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నేతన్న నాగరాజు.
త్రీడీ సాంకేతికతో కృష్ణుడి చిత్రాలకు వస్త్రంపై నాగరాజు ప్రాణం పోశాడు. త్రీడీ అద్దాలతో చూస్తే.. ఓ వైపు గోమాత సమేత గోపాలుడు... మరో వైపు గోపికలతో కూడిన గిరిధరుడు మురిపిస్తున్నాడు. ఈ విచిత్రాన్ని చూసి వినియోగదారులూ ఆశ్యర్యపోతున్నారు. 40 రోజుల పాటు కష్టపడి 'శ్రీకృష్ణ మాయ' అనే ఈ చీరను తయారుచేశానని నాగరాజు తెలిపారు.
మహిళల మేనిపై హత్తుకుపోయి.. రంగురంగుల్లో దర్శనమిచ్చే త్రీడి ప్రింట్ మేజిక్ కోక కట్టుకోక తప్పదిక అన్నంతగా మహిళలను ఆకట్టుకోవడం ఖాయం.
ఇవీ చూడండి-గుడిసెకు ఏసీ.. అభిమానాన్ని చాటుకున్న అల్లుడు