Three Boys Died Falling Into Pond: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఓ పాఠశాలలో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ కోర్స్ సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు చెరువులో లోతు గమనించకుండా దిగడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు అటుగా వెళ్లేవారికి విషయం చెప్పారు. వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు షాబాజ్, దీపక్, పవన్‌గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. దీంతో గచ్చిబౌలి టెలికాంనగర్‌లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: