ETV Bharat / state

ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు... నీటి గుంటలో శవమై తేలాడు! - latest crime news in kundhurpi

స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అదృశ్యమైన పదమూడేళ్ల బాలుడు ఓ నీటి గుంటలో శవమై తేలాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో జరిగింది.

అదృశ్యమైన బాలుడు... నీటి గుంటలో శవమై తేలాడు

author img

By

Published : Jun 21, 2020, 8:38 AM IST

స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కొండమీదికి వెళ్లిన ఓ బాలుడు శవమై కనిపించాడు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న కుందుర్పమ్మ కొండపైకి చిన్నారులు తరచూ ఆడుకోటానికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మంజునాథ అనే పదమూడేళ్ల బాలుడు తన మిత్రులతో వెళ్లి తప్పిపోయాడు.

ఈ విషయమై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.... కొండ ప్రాంతంలోని ఓ నీటి గుంటలో శవమై కనిపించాడు. తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.