ETV Bharat / state

కరోనా బాధితుల ఇంట్లో చోరీ - గుంతకల్లులో చోరీ వార్తలు

కరోనాతో ఆ ఇంటి పెద్ద మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు.. వారి ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఎత్తుకెళ్లారు.

Theft in the home of a corona victims in guntakal

author img

By

Published : Aug 12, 2020, 5:10 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనా బాధితుల ఇంట్లో చోరీ జరిగింది. ఘటన ఆదివారం రాత్రి జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కథల వీధికు చెందిన వృద్ధుడు సుబ్రహ్మణ్యంకు కరోనా సోకటంతో మూడు రోజుల కిందట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతని కుటుంబ సభ్యులు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు.. బాధితుల ఇంట్లోకి చొరబడి 3 లక్షల రూపాయల నగదుతో పాటు 8 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారని రెండో పట్టణ సీఐ గోవిందు తెలిపారు. చోరీకి గురైన ఇంటిని సీఐ గోవిందు పరిశీలించారు. వీడియో కాల్​ ద్వారా బాధితులతో మాట్లాడి పోయిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి

అద్దె ఇంట్లో 2 సార్లు దొంగతనం.. విచారణలో తేలిన మరో నిజం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.