కరోనా మహమ్మారి నియంత్రణ కోసం… అనంతపురంలోని కూరగాయల మార్కెట్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి మార్చారు. నగరంలోని పాతూరులో ఉన్న కూరగాయల మార్కెట్కు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి.. కొనుగోళ్లు చేస్తారు. అక్కడ సామాజిక దూరం పాటించలేని పరిస్థితి నెలకొనటంతో.. మార్కెట్ ను అధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు.
నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. నగర ప్రజలు మార్కెట్ మార్చిన అంశాన్ని తెలుసుకొని… కొవిడ్ నియంత్రణకు సహకరించాలని పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: 'అంబులెన్సుల అడ్డగింతపై సీఎం ఎందుకు స్పందించట్లేదు'