ETV Bharat / state

తాడిపత్రిలో ఉద్రిక్తతల నడుమ ముగిసిన నామినేషన్ల పర్వం - అనతంలో నామినేషన్లు

అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంస్థలో ఉద్రిక్తతల నడుమ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెదేపా అభ్యర్థుల నామినేషన్లను వైకాపా వర్గీయులు అడ్డుకోవటంతో పురపాలక కార్యాలయంలో వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో నామినేషన్ దాఖలు కార్యక్రమం సజావుగా సాగింది.

ముగిసిన నామినేషన్ల పర్వం
ముగిసిన నామినేషన్ల పర్వం
author img

By

Published : Mar 13, 2020, 9:02 PM IST

ముగిసిన నామినేషన్ల పర్వం

అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంస్థలో వివాదాల నడుమ ఎట్టకేలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తాడిపత్రి మున్సిపాలిటీలో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా వైకాపా వర్గీయులు అడ్డుకోవటంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం గేటు సమీపంలో కూర్చోవటంతో తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయటానికి భయపడ్డారు. మరికొంతమంది వైకాపా వర్గీయులు ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోనే తిష్టవేసి తెదేపా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెదేపా కార్యకర్తలు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటంతో.. ఆయన పురపాలక సంఘం వద్దకు చేరుకున్నారు.

ఇరువర్గాలను బయటకు పంపించిన పోలీసులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య మాటా మాటా పెరగటంతో పరిస్థితి చేజారే ప్రమాదముందని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ కార్యాలయానికి దూరంగా పంపించారు. వైకాపా నేతలు నామినేషన్లు చించేశారని జేసీ దివాకర్​రెడ్డి జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు, కార్యాలయంలో ఉన్న వైకాపా నాయకులను బయటకు పంపించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్​పై దిశ కేసు పెట్టాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.