ETV Bharat / state

ఎస్కేయూ 19వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ - ఎస్కేయూ స్నాతకోత్సవం తాజా సమాచారం

బోధన, పరిశోధన, విస్తరణపరంగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అద్భుతమైన ప్రగతిని కలిగి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతిష్టాత్మక 'అటల్ ఇంక్యుబేషన్ సెంటర్' ను స్థాపించడం ద్వారా ఎన్ఐటిఐ ఆయోగ్ చేత గుర్తింపు పొందిందన్నారు. ఎస్కేయూ 19వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Governor Bishwabhushan Harichanda
author img

By

Published : Apr 25, 2021, 10:43 AM IST

వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి మెరుగైన విద్యనందించడంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాత్ర అమోఘమని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. ఎస్కేయూ 19వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ వర్చువల్‌ విధానంలో హాజరై మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా.. సంక్షోభానికి తగ్గట్టుగా అన్ని విద్యాసంస్థలు మార్పు చెందాల్సిన ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో నూతన ఆవిష్కరణలు పెద్ద ఎత్తున అవసరమవుతాయన్నారు. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి ఎస్కేయూ తరపున గౌరవ డాక్టరేట్‌ అందించారు.

ఆవిష్కరణలు కేవలం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదని సతీష్‌రెడ్డి అన్నారు. యువత తాము ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. మనందరికి ఇది పరీక్ష సమయమని, దీటుగా సవాళ్లను ఎదుర్కొవాలని విద్యార్థులకు సూచించారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు యువత అన్ని రకాలుగా సిద్దమై ఉండాలన్నారు.

ఇదీ చదవండీ.. జస్టిస్ ఎన్వీ రమణకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.