ఇదీ చూడండి:
నా భూమి వివాదంలో చిక్కుకుంది.. న్యాయం చేయండి..! - anantapur crime news
భూ వివాదంలో న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ రైతు నీటిట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ప్రత్యర్థులు రాజీకోసం తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని.. లేకుంటే చనిపోతానని బెదిరించాడు.
రైతును కిందికి తీసుకొస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్లో రెడ్డప్ప అనే రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భూమి వివాదంలో చిక్కుకుందని సమస్య పరిష్కరించాలని.. లేకుంటే పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. ధర్మవరం మండలం మాలగుండ్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్పకు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, నాగరాజులకు భూ వివాదం ఉంది. ఇరువురు కేసులు పెట్టుకోగా...ధర్మవరం కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. కేసు రాజీ కావాలని ప్రత్యర్థులు తనను బెదిరించారని, తనకు అధికారులు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. స్థానిక యువకులు గమనించి రైతును కిందకు దించి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి రెడ్డప్ప అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు ధర్మవరం మండలం మాల గుండ్ల పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప కు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ నాగరాజు లకు పొలం గట్టు వద్ద సమస్య ఉంది 2015లో ఇరువర్గాలు ఘర్షణ పడి పరస్పరం కేసులు పెట్టుకున్నారు ధర్మవరం కోర్టులో ఈ కేసుల విచారణలో ఉన్నాయి కేసు రాజీ కావాలని రాజశేఖర్ నాగరాజు తనను బెదిరించారని తనకు అధికారులు న్యాయం చేయాలంటూ రెడ్డప్ప ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు స్థానిక యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ట్యాంకు పై ఉన్న రైతు రెడ్డప్ప వద్దకు యువకులు చేరుకొని అతనిని ట్యాంక్ పై నుంచి కిందకు దించి పోలీసులకు అప్పగించారు భాను సాగుచేస్తున్న పొలం లోకి పొలం తనదంటూ రాజశేఖర్ నాగరాజులు వచ్చి తమ పైన గతంలో దాడి చేశారని ఇప్పుడు బెదిరిస్తున్నారని పోలీసులకు
రెడ్డప్ప తెలిపాడు ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు
Body:రైతు ఆత్మహత్యాయత్నం
Conclusion:అనంతపురం జిల్లా
రెడ్డప్ప తెలిపాడు ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు
Body:రైతు ఆత్మహత్యాయత్నం
Conclusion:అనంతపురం జిల్లా