అనంతపురం జిల్లా మడకశిర మండలం జిల్లెడగుంట, భక్తరహళ్లిలో ఆంజనేయస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా... ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ప్రధాన ఘట్టం భూతప్పల ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా... భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు పాటించి తడిబట్టలతో నేలపై బోర్లా పడుకుంటారు. భూతప్పలుగా పిలవబడే వ్యక్తులు కత్తులు చేతబూని భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. ఇలా భక్తులపై భూతప్పలు కాలుమోపితే... కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తుల పెద్దసంఖ్యలో ఈ జాతరకు తరలివచ్చారు.
ఇదీ చదవండీ...