తెలుగు వీర లేవరా.. కరోనాను తరుమురా.. దేశాన్ని కాపాడురా.. అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉపాధ్యాయ సంఘాల నేతలు రోడ్లపై ప్లకార్డులుతో ర్యాలీ చేపట్టారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాం ధీచౌక్, కసాపురం కూడలి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగించారు. రోడ్లపైకి రాకండి.. రోగాన్ని కొని తెచ్చుకోకండి అంటూ ప్రచారం చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. ప్రజలకు అవగాహన కల్పించేందుకే తమ కర్తవ్యంగా ఈ ర్యాలీ చేపట్టామన్నారు. కొవిడ్ నిబంధనాలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. అంతా భౌతిక దూరం పాటించాలని.. అత్యవసర సమయాల్లోనే మాస్కుతో బయటకు రావాలని చెప్పారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్