ETV Bharat / state

"చంద్రబాబు కృషితోనే.. అనంతపురానికి 'కియా" - chandhrababu naidu

ఆంధ్రాలోకి సరికొత్త అధ్యాయానికి తెదేపా అధినేత చంద్రబాబు కృషి మరువలేనిదని తెదేపా నేతలు తెలిపారు. ఆయన కృషితోనే అనంతపురానికి కియా పరిశ్రమ వచ్చిందని చెప్పారు.

కియా పరిశ్రమకు తెదేపా శుభాకాంక్షలు
author img

By

Published : Aug 8, 2019, 6:59 PM IST

కియా పరిశ్రమకు తెదేపా శుభాకాంక్షలు

కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు ఒక వరమంటూ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే జిల్లాకు పరిశ్రమ వచ్చిందని... నేడు ఇంత పెద్ద ఎత్తున కియా కార్లు విడుదల చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయమంటూ శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమ కోసం 3 రాష్ట్రాలు పోటీ పడగా అందులో వారు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేయడం గర్వకారణమని చెప్పారు. దానికి కారణం కియా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి... అనంతపురం జిల్లాకు వచ్చేలా ఎంతో కృషి చేశారన్నారు. అయితే రాజశేఖర రెడ్డి కియా పరిశ్రమ రావడానికి కృషి చేశారని వైకాపా నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానికంగా ఉంటున్న వారికి 90 శాతం ఉద్యోగాలు కల్పించాలని కియా ప్రతినిధులను కోరారు.

ఇది చూడండి: మళ్లీ ఫిక్సింగ్ కలకలం.. మన్సూర్-​అక్మల్​​ వివాదం

Intro:...

Body:..

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.