ETV Bharat / state

ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్​ గొంతు నులిమేశారు: ఎం.ఎస్.రాజు - సీఎం జగన్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు తెదేపా నేత ఎం.ఎస్.రాజు డిమాండ్

డాక్టర్ సుధాకర్ మృతికి ప్రభుత్వమే కారణమని తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆరోపించారు. ప్రశ్నించినందుకే ఆయన కుటుంబాన్ని పోలీసుల ద్వారా చిత్ర హింసలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​పై ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం లేదని డీజీపీని ప్రశ్నించారు.

tdp leader ms raju allegations on doctor sudhakar death
డాక్టర్ సుధాకర్ మృతిపై తెదేపా నేత ఎం.ఎస్.రాజు ఆరోపణలు
author img

By

Published : May 23, 2021, 5:10 PM IST

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నడి రోడ్డుమీద డాక్టర్ సుధాకర్​ను.. పోలీసులు వైసీపీ గుండాల్లా వ్యవహరించి మానసికంగా మనోవేదనకు గురి చేశారని తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వాన్ని దళితులు ప్రశ్నిస్తే వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఎం.ఎస్.రాజు ఆరోపించారు. ఇంత దారుణానికి ఒడికడుతున్న సీఎం జగన్​పై ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయరని.. డీజీపీ గౌతమ్ సవాంగ్​ను ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని త్వరలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పరామర్శిస్తారని తెలిపారు. వారికి తెదేపా అన్ని రకాలుగా అండగా ఉంటుందని మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఇదీ చదవండి:
విద్యుదాఘాతంతో రైతు మృతి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.