పింఛన్ల తొలగింపుపై అనంతపురం జిల్లా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వేలాది మంది తెదేపా శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, హిందూపురం పార్లమెంటరీ అధ్యక్షులు బి.కె పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తొలగించి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరిటాల శ్రీరామ్ ఎన్నో రోజులు ఈ పాలన కొనసాగదని అన్నారు. పోలీసులు అడుగడుగునా ర్యాలీని అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు.