అనంతపురంలోని తెదేపా కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో కలిసి ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన నేత చంద్రబాబు అని అన్నారు. దేశ రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించగల శక్తి ఆయనకు ఉందని.. నేటి యువత ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకోవాలని కాలువ పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గంలో..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
రాయదుర్గంలో..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ.. తెదేపా చేసిన అభివృద్ధిని నాయకులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మండలం తేదేపా కన్వీనర్ ఎంఆర్ఎఫ్ హనుమంతు, తెదేపా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుకొండలో..
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పెనుకొండలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఇదీ చదవండి: