అనంతపురం జిల్లా ఉరవకొండ సర్పంచ్ అభ్యర్థి దేవకి దేవి తరఫున తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. విద్యావంతురాలైన దేవకి దేవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
అభివృద్ధి చేయడాన్ని వైకాపా నాయకులు మానేసి... రియల్ ఎస్టేట్ రంగంలో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తే... అవి నకిలీ ఇంటి పట్టాలంటూ విశ్వేశ్వరరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
ఇదీచదవండి.