ETV Bharat / state

కరుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వైకాపా నేతలను అరెస్టు చేయాలని తెదేపా డిమాండ్​ - తెదేపా

TDP protest కరుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వైకాపా నేతలను వెంటనే అరెస్టు చేయాలని, అనంతపురం తెదేపా ఎస్సీ సెల్ నేతలు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. వైకాపా ప్రభత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆరోపించారు.

TDP leaders
కరుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వైకాపా నేతలను అరెస్టు చేయ్యాలి
author img

By

Published : Aug 23, 2022, 5:05 PM IST

TDP demand for Arrest: అనంతపురం జిల్లా కావలిలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వైకాపా నేతలను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా.. జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు వెళ్తున్న తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. ఈనెల 25న నారా లోకేశ్​ ఆధ్వర్యంలో చలో దుగ్గిరాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆలోగా నిందితులను అరెస్ట్​ చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు, అనంతపురంలో తెదేపా ఎస్సీ సెల్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని తెదేపా ఎస్సీ సెల్ విభాగం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.