మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జ్వరం రావటం వల్ల కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోగా.. కొవిడ్ సోకినట్లు తేలింది. వైద్యుల సిఫార్సు మేరకు కుటుంబసభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని రఘునాథరెడ్డి సూచించారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వైరస్ను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి