రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానమంటూ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించి, మహిళల ఆదాయాన్ని పెంచే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఇందుకు భిన్నంగా కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరులుగా మార్చేసిందన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ధర్నాకు పార్టీ కార్యకర్తలు నాయకులు తరలిరావాలని అన్నారు.
ఇదీచూడండి.పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టివేత