తెదేపా ప్రభుత్వంలో ఉపాధి హామీ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు(jc prabhakar reddy protest) దిగారు. ఉదయాన్నే పెద్దవడుగూరు మండలం చేరుకొని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన జేసీ.. హైకోర్టు ఆదేశించినా బిల్లులు ఎందుకు చెల్లించటంలేదని ప్రశ్నించారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లు చెల్లించటానికి ఎమ్మెల్యేను కలిసి రావాలని ఎందుకు చెబుతున్నారని ఎంపీడీవోను నిలదీశారు.
కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తున్న ఎంపీడీవోపై కోర్టుకు వెళతామని జేసీ హెచ్చరించారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy )ఎంపీడీవో కార్యాలయంలోనే బైఠాయించారు. బిల్లు చెల్లింపులు ఎప్పుడూ చేసేది లిఖితపూర్వకంగా ఇస్తేనే తాను ఆందోళన విరమిస్తానని.. లేదంటే ఇవాళ రాత్రి కూడా కార్యాలయంలోనే నిద్రిస్తానని జేసీ స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేకు ఏమి చెప్పుకుంటారో తనకు అనవసరమని.. వెంటనే బిల్లులు చెల్లించాలని ఆయన అధికారులను కోరారు.
ఇదీ చదవండి