ETV Bharat / state

తుప్పు పట్టిస్తున్నారు..తుక్కుగా మారుస్తున్నారు! - అనంతపురంలో తుప్పు పడుతున్న స్వచ్ఛ వాహనాల వార్తలు

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకాన్ని అటకెక్కించారు. పర్యావరణానికి హాని కలగకుండా, స్వచ్ఛత పనుల నిమిత్తం సరఫరా చేసిన యంత్రాలు, వాహనాలకు తుప్పు పట్టిస్తున్నారు. షెడ్యూల్‌ కులాల లబ్ధిదారులకు స్వయం ఉపాధితోపాటు పంచాయతీల్లో మురుగు, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు పంపిణీకి నోచుకోవడం లేదు. నెలలు గడుస్తున్నా కార్యాలయాలకే పరిమితం అయ్యాయి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయి.

swachh vehicles
తుప్పు పట్టిస్తున్నారు..తుక్కుగా మారుస్తున్నారు!
author img

By

Published : Dec 5, 2020, 1:53 PM IST

మహాత్మాగాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ షెడ్యూల్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థతో ముందడుగు వేసింది. సాంకేతికతతో కూడిన గార్బేజి వాహనాలు, ట్రాక్టరు లోడర్లు షెడ్యుల్‌ కులాల లబ్ధిదారులకు రాయితీతో అందజేయాలని సంకల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగు కాలువలను సులువుగా శుభ్రం చేసేందుకు ట్రాక్టరు లోడర్లు ఉపయోగపడతాయి. గార్బేజి వాహనాలకు 60 శాతం రాయితీ, ట్రాక్టరు లోడరుకు 35 శాతం రాయితీ, 60 శాతం రుణం, రూ.20 వేలు లబ్ధిదారు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.

సమన్వయ లోపం

గార్బేజి వాహనాలు, ట్రాక్టరు లోడర్లు పొందిన లబ్ధిదారులు అనంతపురం జిల్లాలోని 2,500 కంటే జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీ కార్యాలయాలకు అద్దెకు ఇవ్వాలి. ప్రతి నెలా పంచాయతీలు అద్దెను చెల్లించిన తర్వాత, ఆ మొత్తంలో బ్యాంకు రుణం చెల్లించి మిగిలిన సొమ్ము లబ్ధిదారు ఖాతాలో జమ చేసేలా కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పంచాయతీ అధికారులు, కార్పొరేషన్‌ మధ్య సమన్వయం కుదరక వాహనాల పంపిణీ ఆగిపోయింది. పంచాయతీల వద్ద నిధులు లేవన్న సాకుతో వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే లబ్ధిదారులతో పలుమార్లు దరఖాస్తులు స్వీకరించారు. వారితో ఒప్పందం చేయించుకున్నారు. అయితే వాహనాలను పంపిణీ చేయలేదు.

పంపిణీకి చర్యలు తీసుకుంటాం

ఆటోలు, ట్రాక్టరు ట్రాలీలు కొన్ని నెలలుగా పంపిణీ చేయకపోవడం వాస్తవమే. పంచాయతీ అధికారులతో సంప్రదించాం. ఇప్పటికే సమస్యను కలెక్టర్‌ గంధం చంద్రుడు దృష్టికి తీసుకెళ్లాం. వాహనాలను లబ్ధిదారులకు అప్పగించే వరకు వాటి పనితీరును చూడాల్సిన బాధ్యత వాహన సంస్థలదే. త్వరలోనే వాహనాలను అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. - యుగంధర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

విద్యుత్తుతో నడిచే ఆటోలు (గార్బేజ్‌ ఆటోలు).

తడి, పొడి చెత్త వేర్వేరుగా తీసుకెళ్లడానికి వీలుగా రూపొందించారు. ఒక్కో ఆటో విలువ రూ.2.25 లక్షలు. 2018-19లో జిల్లాకు రూ.7.29 కోట్ల నిధులతో 353 వాహనాలు మంజూరు కాగా.. గతేడాది జులై, డిసెంబరు నెలల్లో రూ.2.33 కోట్ల విలువ చేసే 112 వాహనాలను పంపిణీ చేశారు. మిగిలిన రూ.4.96 కోట్ల విలువైన 241 వాహనాలను ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం వెనుక నిలిపేశారు. అవన్నీ తుప్పు పట్టి పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది.

ట్రాక్టర్లు, లోడర్లు

ఒక్కో వాహనం విలువ రూ.15 లక్షలు. జిల్లాకు రూ.9.45 కోట్ల విలువ చేసే 63 ట్రాక్టర్లు, లోడర్లను కేటాయించారు. ఇందులో 63 లోడర్లు జిల్లాకు వచ్చాయి. రూ.1.05 కోట్ల విలువైన యంత్రాలను ఈ ఏడాది జనవరిలో ఏడుగురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన వాటికి ఇంజిన్లు రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం వెనుక చెట్ల కింద ఉంచేశారు.

ఇవీ చదవండి..

ఆలయంలో చోరీకి యత్నం.. దుండగులను పట్టుకున్న అర్చకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.