ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పి.వి.సిద్ధారెడ్డి ప్రారంభించారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కలుషితమై విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలంటూ...ప్లాస్టిక్ వాడొద్దు పర్యావరణానికి ముప్పు తేవద్దు అంటూ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శస్తూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: ఆసుపత్రికి వెళ్లాలంటే రోగిని 5 కి.మీ మోసుకెళ్లాల్సిందే!