బస్సు సౌకర్యం కల్పించాలంటూ విద్యార్థుల ధర్నా - students ptotest for bus in ananthapuram district
తమ మండల కేంద్రం నుంచి కళ్యాణదుర్గం పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించాలని... విద్యార్థులు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రం నుంచి కళ్యాణదుర్గంలో ఉన్న కళాశాలలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేవని విద్యార్థులు వాపోయారు. అపిలేపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆపి తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.