ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోరుతూ...విద్యార్థుల ఆందోళన - హిందుపురంలో విద్యార్థుల ఆందోళన

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ఆందోళన తెలిపారు.

సమస్యల పరిష్కారం కోరుతూ...విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Nov 23, 2020, 3:47 PM IST

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద విద్యార్థినులు స్మార్ట్​ఫోన్లు లేక ఆన్​లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని...వారిపై అపరాధ రుసుం విధించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్రిన్సిపాల్​ను తొలగించి మహిళా ప్రిన్సిపాల్​ను నియమించాలని డిమాండ్ చేశారు. కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

నిరసన కార్యక్రమం ముగించుకొని కళాశాలకు తిరిగి వచ్చిన విద్యార్థినులను లోపలికి రానివ్వకుండా కళాశాల సిబ్బంది అడ్డుకొని గేటుకు తాళాలు వేశారు. దీన్ని నిరసిస్తూ...విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కళాశాల సిబ్బందితో మాట్లాడి విద్యార్థినులను కళాశాల లోపలికి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీచదవండి

పోలవరం నిధుల సాధనకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలి: సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.