విద్యాదీవెన పథకం అమలు పట్ల ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని.. అనంతపురంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కోసం ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. అదనపు సెంటర్లు నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
కళాశాలలో అనేక సమస్యలు ఉన్నా.. ప్రిన్సిపల్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ ఆరోపించారు. వాటి పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: