అనంతపురం నగర శివార్లలోని ఓ పాఠశాలలో శనివారం ఉదయం ఆరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు పాఠశాల వసతి గది నుంచి హాస్టల్ బయటకు వెళ్లిపోయారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. పిల్లల ఆచూకీ కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పుట్టపర్తి నుంచి బస్సులో వచ్చిన ఆరుగురు విద్యార్థులు ధర్మవరంలో అనుమానాస్పదంగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ధర్మవరం చేరుకున్న తల్లిదండ్రులకు... సీఐ ఆస్రాభాషా పిల్లలను అప్పగించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధింపులు.. నాణ్యమైన భోజనం లేనందువల్ల తాము వెళ్లిపోయినట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.
ఇదీ చదవండీ... హామీల అమలులో సీఎంది అగ్రస్థానం: మంత్రి