ఎయిడెడ్ కళాశాలలు కొనసాగించాలని.. అనంతపురంలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలు యధావిధిగా కొనసాగించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్ఎస్యూఐ నిరసన...
ఎస్ఎస్బిఎన్ కళాశాలను ఎయిడెడ్ సంస్థగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థులు అనంతపురంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేట్‌గా మార్చే నిర్ణయాన్ని విరమించుకోవాలని కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. నగరంలోని కళాశాలల నుంచి పెద్దఎత్తున వచ్చిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలను ప్రైవేటీకరించి విద్యార్థులపై ఫీజుల భారం మోపుతోందని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునే యత్నం చేస్తోందని విమర్శించారు. విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేసి, గేట్లు
మూసివేశారు.
విద్యార్థిని అభినందించిన ఎస్పీ..
అనంతపురంలో విద్యార్థులతో పోలీసులకు జరిగిన తోపులాటలో గాయపడిన విద్యార్థిని విజయలక్ష్మిని ఎస్పీ పకీరప్ప పరామర్శించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను అభినందించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. నిజాలు నిక్కచ్చిగా చెప్పి విద్యార్థిని ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎస్ఎస్బిఎన్ కళాశాలలో జరిగిన గొడవకు సంబంధించి విచారణ చేస్తున్నామన్న ఆయన.. రాళ్లు విసిరిన వ్యక్తులు ఎవరనేది తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: