అనంతపురం జిల్లా కదిరి పట్టణం బేరిపల్లి కాలనీకి చెందిన అనిల్ కుమార్.. తొమ్మిదో తరగతి విద్యార్థి. 4 రోజుల క్రితం స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లాడు.
ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడ్డాడు. అనిల్ కు స్థానికంగా చికిత్స చేయించి.. అనంతరం తిరుపతికి తరలించారు. అనిల్ ఆరోగ్యం విషమించి.. ఆదివారం కన్నుమూశాడు.