ETV Bharat / state

అంగన్‌వాడీలకు కోడిగుడ్లు బంద్‌.. పట్టించుకోని ఐసీడీఎస్‌ అధికారులు - Anantapur district latest news

అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నిర్లక్ష్యం నెలకొంది. అంగన్‌వాడీలకు కోడిగుడ్లు, వైఎస్‌ఆర్‌ కిట్లు అందించలేని పరిస్థితి తలెత్తింది. పది రోజులుగా సమస్య తలెత్తినా ఐసీడీఎస్‌ అధికారులు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల గుడ్ల సరఫరా ఆగింది నిజమేనని.. త్వరలో సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని జిల్లా ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మీ తెలిపారు.

anganwadi centers in Anantapur
అంగన్‌వాడీలకు కోడిగుడ్లు బంద్‌.
author img

By

Published : Feb 21, 2021, 5:15 PM IST

రాష్ట్రంలోని పేద పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో కోడిగుడ్లు, పాలు, భోజనం, నిత్యావసర సరకులు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లు, బాలామృతం సరఫరా చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నిర్లక్ష్యం నెలకొంది. అంగన్‌వాడీలకు కోడిగుడ్లు, వైఎస్‌ఆర్‌ కిట్లు అందించలేని పరిస్థితి తలెత్తింది.

రూ.15 కోట్లకుపైగా బిల్లుల బకాయి ఉండటంతో గుత్తేదారులు సరఫరాను ఆపేశారు. బడ్జెట్‌ తగినంత ఉన్నా చెల్లించకపోవడం విశేషం. పది రోజులుగా సమస్య తలెత్తినా ఐసీడీఎస్‌ అధికారులు పట్టించుకోలేదు. జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు మాసాల నుంచి ఆరేళ్ల పిల్లలు 3.5 లక్షలు, 70 వేలకుపైగా బాలింతలు, గర్భిణులు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరికి పౌష్టికాహార పంపిణీలో తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతోంది.

గుడ్లకు రూ.8 కోట్లు..

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నెలకు 24 నుంచి 26 కోడిగుడ్లు చొప్పున ఇస్తున్నారు. ప్రతి పది రోజులకోసారి గుడ్లు సరఫరా చేయాలి. ఈ నెలలో పది రోజులకు మాత్రమే గుడ్లను ఇచ్చారు. రెండో విడత ఇవ్వలేదు. ఇక మూడో విడత అనుమానమే. అక్టోబరు నుంచి కోడిగుడ్ల గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు జరగలేదు. నాలుగు మాసాలకు రూ.8 కోట్ల బిల్లు బకాయి ఉంది. సంబంధిత శాఖ వద్ద బడ్జెట్‌ రూ.9 కోట్లకుపైగా ఉన్నట్లు తెలిసింది. సీడీపీఓలు ప్రాజెక్టుల వారీగా ఓచర్లు, ఎన్‌ఓసీలతో కూడిన బిల్లులు పీడీ కార్యాలయానికి పంపారు. ఇక్కడి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

సంపూర్ణ పోషణ అంతే..

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్ల (బాల సంజీవని) సరఫరాను కూడా ఆపేస్తున్నామని సంబంధిత గుత్తేదారు కలెక్టర్‌, జేసీకి లేఖలు పంపారు. గర్భిణులు, బాలింతలకు నెలకోసారి కిట్లను ఇస్తున్నారు. రాగిపిండి, అటుకులు, సజ్జ/జొన్న పిండి కిలో చొప్పున, బెల్లం, ఎండు ఖర్జూరం, వేరుసెనగ చిక్కి 250 గ్రాముల ప్రకారం కిట్‌లో ఉంటాయి. ప్రతి నెలా రూ.1.4 కోట్ల చొప్పున బిల్లు చెల్లించాలి. గతేడాది సెప్టెంబరు నుంచి జనవరి దాకా ఐదు నెలలకు కలిపి రూ.7 కోట్ల బిల్లు బకాయి ఉంది. దీంతో సరఫరా చేయలేమంటూ గుత్తేదారుడు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కిట్లకు సంబంధించి శాఖ వద్ద బడ్జెట్‌ రూ.14 కోట్లు ఉన్నట్లు తెలిసింది.

త్వరలోనే పరిష్కరిస్తాం

కోడిగుడ్లు, వైఎస్‌ఆర్‌ కిట్ల బిల్లుల బకాయి వాస్తవమే. త్వరలోనే పరిష్కరిస్తాం. కొన్నిచోట్ల గుడ్ల సరఫరా ఆగినట్లు చెబుతున్నారు. కిట్ల పంపిణీ ఆగకుండా చర్యలు తీసుకుంటాం. బిల్లుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. - విజయలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్‌

ఇదీ చదవండి:

పల్లెపోరు: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పోలింగ్ ఏజెంట్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.